Wednesday, March 13, 2019

14న ఎన్నికలపై శిక్షణ తరగతులు….

ఒంగోలు , న్యూస్‌టుడే:
సార్వత్రిక ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు, బీమా అధికారులు, బ్యాంకు అధికారులు, సిబ్బందికి గురువారం స్థానిక ఎ1 కన్వెన్షన్‌ హాలులో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల శిక్షణ తరగతులకు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. గైర్హాజరయ్యే అధికారులు, ఉద్యోగులపై ఎన్నికల నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
               

No comments:

Post a Comment