Wednesday, March 13, 2019

దోబీల్లో పట్టుచీరల రవాణా….

కడప న్యూస్‌టుడే:
*సరైన బిల్లులు చూపకుండా చీరలు రవాణా 
*చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన వాహానం.
 నిన్న రాత్రి పుల్లంపేట మండల పరిధి అనంతయ్యగారి పల్లె చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన వాహానాల తనిఖీలు నిర్వహించారు.బుధవారం చేపట్టిన తనిఖీల్లో 5,400 పట్టుచీరలను స్వాధినం చేసుకున్నామని పుల్లంపేట ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు.వివరాలు……బిల్లులు లేకుండా చైన్నై నుండి గుంతకల్లుకు తరలిస్తున్న 5400 పట్టు చీరలను స్వాధినం చేసుకున్నారు.చీరలను దోబీ మూటల్లా కట్టి తరలిస్తున్నట్లు,చీరలకు సంబంధించి ఎలాంటి బిల్లులు చూపకపోవడంతో వాహానాన్ని స్వాధినం చేసుకుని ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేశామని తెలిపారు.వీటి విలువ దాదాపు రూ.16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. డీఎస్పీ మరళీధర్,సీఐ నరసింహులు పట్టుబడిన వాహానాన్ని  పరిశీలించారు.

No comments:

Post a Comment