Wednesday, March 13, 2019

చక్కర్లు కొడుతున్న పాక్ యుద్ధ విమానాలు ….?

పూంచ్‌ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:
  • భారత సరిహద్దులో పాక్ యుద్ధ విమానాల చక్కర్లు.
  • వేగంగా వెళ్లిన ఆ యుద్ధ విమానాల శబ్దాలు కూడా వినపడ్డాయని వారు తెలిపారు.
పాకిస్థాన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు మళ్లీ భారత సరిహద్దులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత రాత్రి జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌ ఎల్‌ఓసీకి దగ్గరగా వచ్చినట్లు భారత సైన్యం గుర్తించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వేగంగా వెళ్లిన ఆ యుద్ధ విమానాల శబ్దాలు కూడా వినపడ్డాయని వారు తెలిపారు. దీంతో భారత వైమానిక రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఏ క్షణంలో ఏమి జరిగినా ‘భారత వైమానిక రక్షణ వ్యవస్థతో పాటు రాడార్లు కూడా అలర్ట్‌గా ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment