Wednesday, March 13, 2019

మనస్తాపం మృతి చెందిన మౌనిక….

కనిగిరి, న్యూస్‌టుడే:
అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్తాపం చెందిన ఓ వివాహిత ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన బుధవారం పట్టణంలోని బీసీ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సై దాసరి ప్రసాద్‌ కథనం ప్రకారం… కాలనీకి చెందిన దగ్గు సాయితో మౌనిక(19)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్ని నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారికి ఏడాది వయసున్న పాప ఉంది. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments:

Post a Comment