శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2.ఉత్తరాంధ్ర పార్లమెంటు నియోజకవర్గాల .
3.పురందేశ్వరి నియోజకవర్గాల కు రాక .
జిల్లాలోని ఈ నెల 14 తేదీన టెక్కలి, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర పార్లమెంటు నియోజకవర్గాల క్లస్టర్ ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి హాజరు కానున్నారని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, జోనల్ ఇన్‌ఛార్జి పూడి తిరుపతిరావు, దుప్పల రవీంద్ర, శవ్వాన ఉమామహేశ్వరి, చల్లా వెంకటేశ్వరరావు, ఎస్.వి.రమణ, గడ్డేయ్య, సూరపునాయుడు, వరికాంత్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment