Saturday, March 16, 2019

టీడీపీని వీడి వైసీపీలో చేరిన ముగ్గురు కీలక నేతలు….


హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీలో చేరారు. లోటస్ పాండేలో జగన్‌ సంక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలనేది ఆశయం. మాకు కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలి.’’ అని అన్నారు.
మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఎంపీ బుట్టారేణుక, నెల్లూరు టీడీపీ నేత ఆదాల ప్రభాకర్‌కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ‘‘టీడీపీ తనను మోసం చేసిందది. టీడీపీలో బీసీలకు అన్యాయం జరిగింది. కర్నూలు బీసీ సిట్టింగ్‌ సీట్లు ఓసీలకు ఇచ్చారు. వైసీపీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి తప్పు చేశా. తెలుగుదేశం పార్టీ నాకు ఎంపీగా సీటు ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. బీసీల పార్టీ అని చెప్పుకునే పార్టీలో బీసీ మహిళగా ఉన్న నన్ను అవమానించారు. జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేస్తా. జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేస్తా. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు.’’ అని బుట్టా రేణుక అన్నారు.

No comments:

Post a Comment