విశాఖపట్నం,న్యూస్‌టుడే:
భాజపా తరఫున విశాఖ లోక్‌సభ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పేరు ఇంచుమించు ఖరారైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ హరిబాబు ఆ సీటు కోసం పెద్దగా ఆసక్తి చూపటం లేదు. పార్టీ నాయకత్వం ఆయన్ను సంప్రదించి పోటీచేయాలని అడిగిన సందర్భం లేదు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన నగర పార్టీ కార్యాలయంలోనే పలువురు భాజపా నాయకులతో వివిధ అంశాలపై సంప్రదింపులు జరిపారు.
No comments:
Post a Comment