కడప న్యూస్‌టుడే:
- శుక్రవారం రాత్రి సుధాకర్‌రెడ్డిని విచారించిన పోలీసులు
- విచారించిన అనంతరం విడుదల.
వేల్పులకు చెందిన రాగిపిండి సుధాకర్‌రెడ్డి శుక్రవారం రాత్రి వేముల పోలీసులు విచారించి వదిలేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ హత్య కేసులో సుధాకర్‌రెడ్డి ప్రమేయం ఉంటుందంటూ శుక్రవారం సాయంత్రం ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.దీంతో జిల్లా పోలీసు ఉన్నాతాధికారుల ఆదేశాలు మేరకు సుధాకర్ రెడ్డిని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదని,ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నామన్నారు. ఇలాంటి తరుణంలో టీవీల్లో వార్తలు రావడం బాధగా ఉందని ఆయన వివరించారు. విచారణ అనంతరం ఆయనను వదిలేశారు.

No comments:
Post a Comment