Saturday, March 16, 2019

చోరీ కేసు నమోదు…


విశాఖపట్నం,న్యూస్‌టుడే:
తెల్లవారి నిద్ర లేచాక చూడగా నాలుగు చరవాణిలు, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.  పరిధి కృష్ణానగర్‌లో జి.వెంకటరవికుమార్‌ మరికొంత మంది విద్యార్థులతో కలిసి గది అద్దెకు తీసుకొని స్థానికంగా ఉన్న కళాశాలల చదువుకుంటున్నారు. 15వ తేదీ రాత్రి ఎప్పటిలాగే నిద్రించారు. తెల్లవారి నిద్ర లేచాక చూడగా నాలుగు చరవాణిలు, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక ద్వారం నుంచి లోనికి ప్రవేశించి ఇందుకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటికి సమీపంలోని మరో ఇంట్లో కూడా రూ.50 వేల నగదు, 3 సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు. హెచ్‌సి పి.నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోతినమల్లయ్యపాలెం పోలీసుస్టేషన్‌ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.

No comments:

Post a Comment