Sunday, March 17, 2019

ఆదరిస్తే అండగా ఉంటాను….


శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1) తన తండ్రి శివాజీ స్ఫూర్తితో అభివృద్ధి చేస్తానని  ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష.
2)ఎమ్మెల్యే శివాజీతో కలిసి శిరీష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
అభివృద్ధే లక్ష్యంగా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ముందుకుసాగుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పలాస తెదేపా అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను నిండు మనసుతో ఆదరించండి. మత్స్యకారులకు అండగా ఉండి ప్రస్తుత ఎమ్మెల్యే, తన తండ్రి శివాజీ స్ఫూర్తితో అభివృద్ధి చేస్తానని పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష తెలిపారు. శనివారం వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట నుంచి పలాస ఎమ్మెల్యే శివాజీతో కలిసి శిరీష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.టీడీపీ హయాంలో ఎన్నో అభివృద్ధి ఫలాలు అందుకున్నామని మీవెంటే మేమంటూ మహిళలు ఆమెకు భరోసా ఇచ్చి ఆమె వెంట నడిచారు. తన తాత సర్దార్‌ గౌతులచ్చన్న, తండ్రి శివాజీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ఒక్క అవకాశం ఇస్తే, పలాస నియోజకవర్గాన్ని సంపూర్ణ ప్రగతి దిశలోకి తీసుకువెళ్తానని ఓటర్లను అభ్యర్థించారు. పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు గోవింద పాపారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment