భగవంతుడు! అతనికి అనంత నామాలున్నాయి. నీళ్లను ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో జలము పాని తన్ని వేలం అని పిలిచినట్లే భగవంతుడు రాముడు శివుడు వేంకటేశ్వరుడు అని పిలిచినట్లే అని పిలుస్తారు. మానవులలో భేద గుణాలున్నాయి. కానీ పరమాత్మునిలో లేవు శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన నేటికి ఇంకా కొందరు శివకేశవులకు బేధములు కలిగించి శివుడు గొప్ప రాముడు గొప్ప విష్ణువు గొప్ప అని వాదులాడుకోవడం విడ్డూరంగా ఉంది. “శివాయ విష్ణు రూపాయ శివ రూపాయే విష్ణవే! !శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివః !యధా శివమయో విష్ణుః దేవా విష్ణుమయే శివ” ” యథాంతరం న పశ్చాయే తదామే స్వస్తి రామేసి! శివుడు విష్ణు స్వరూపుడు విష్ణు శివ స్వరూపము శివుని హృదయమే విష్ణు విష్ణు హృదయమే శివుడు విష్ణు ఎట్లు శివమయుడో శివుడు కూడా విష్ణుమయుడే వీరిరువురికి భేదములు లేవు.

No comments:
Post a Comment