Saturday, March 16, 2019

వైసీపీ అభ్యర్థి గా మీ ముందుకు వచ్చా….


కృష్ణా  న్యూస్‌టుడే:
మైల‌వ‌రం అసెంబ్లీకి వైసీపీ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్న వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఈనెల 21వ తేదిన నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.. ఈ విష‌యాన్ని ఆయ‌న ఈరోజు ఇబ్ర‌హీంప‌ట్నంలో నిర్వ‌హించిన రోడ్ షోలో ప్ర‌క‌టించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఎన్నికలు సమయం వచ్చేసింద‌ని, మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మీ ముందు కు వచ్చాన‌ని, . ఒక్క సారి త‌న‌కు అవకాశం ఇవ్వాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే మైలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదంటూ విమ‌ర్శించారు.

No comments:

Post a Comment