Wednesday, March 13, 2019

అసంక్రమిత వ్యాధులను గుర్తించి …..

ఒంగోలు  న్యూస్‌టుడే:
ఉపకేంద్రాల్లో పని చేస్తున్న హెల్త్‌ ప్రొవైడర్లు గ్రామాల్లో అసంక్రమిత వ్యాధులను గుర్తించి పీహెచ్‌సీ వైద్యులకు చికిత్స కోసం పంపించాలని డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి కోరారు. స్థానిక పాత రిమ్స్‌ ప్రాంగణంలోని ఎయిడ్స్, లెప్రసీ కార్యాలయంలో కొత్తగా నియమితులైన హెల్త్‌ప్రొవైడర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మాతాశిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో క్షయ ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు.  అడిషనల్‌ డీఎంహెచ్‌వో కె.పద్మావతి, పీవోడీటీ రామకోటిరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మాధవీలత, డాక్టర్‌ పుల్లారెడ్డి, సుగుణమ్మ, సహన తదితరులు పాల్గొన్నారు.
                            

No comments:

Post a Comment