కొత్తూరు(అనకాపల్లి)న్యూస్‌టుడే :
- ఆరునెలల క్రితం వత్ర విసర్జనకు బయటకు వెళ్లి వస్తున్న విద్యార్థి మరణించిన వార్తను తెలుసుకున్న జ్యోత్స్న స్పందించి పాఠశాలకు మరుగు సమస్యను తీర్చడానికి ముందుకు వచ్చింది..
- అనకాపల్లి మండలంలోని కూండ్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి అమెరికాలో తొమ్మిదో తరగతి చదువుతున్న లగిశెట్టి అక్షర జ్యోత్స్న ముందుకు వచ్చింది.
- ఆరునెలల క్రితం వత్ర విసర్జనకు బయటకు వెళ్లి వస్తున్న విద్యార్థి మరణించిన వార్తను తెలుసుకున్న జ్యోత్స్న స్పందించి పాఠశాలకు మరుగు సమస్యను తీర్చడానికి ముందుకు వచ్చింది.
గ్రామం, సమీప గ్రామాల్లో ఉన్న బంధువుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించిన బాలిక.. నిర్మాణ పనులకు ఉపాధ్యాయులు, గ్రామస్థులతో శంకుస్థాపన చేయించింది. 12 వత్రశాలలు, 4 మరుగుదొడ్లను నిర్మించడానికి వారి బంధువులు చర్యలు ప్రారంభించారు. దీంతో పాఠశాలను సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న మరుగుదొడ్ల సమస్యకు మోక్షం కలగనుందని విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకొని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్న జ్యోత్స్నను పలువురు అభినందిస్తున్నారు. జ్యోత్స్న తండ్రి శివ సత్యసాగర్, తల్లి వనజ కుమారి అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. గతంలో కూడా ఈమె కొత్తకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షలతో బయో టాయిలెట్స్ నిర్మించి ఇచ్చిందని బంధువులు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీవీఎస్‌కే నాయుడు, శానాపతి మునిసీబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment