Thursday, March 14, 2019

ఎన్నికలకు అన్ని సిద్ధం….


బనగానపల్లి, న్యూస్‌టుడే :
  • గతంలో పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన ఘటనల గురించి తెలుసుకున్నారు..*తహసీల్దారు విష్టువర్దన్‌రెడ్డికి పలు సూచనలు చేశారు..
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీ రవిపట్టన్‌ శెట్టి సూచించారు.
పట్టణంలో ఈవీఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూములను బుధవారం ఆయన పరిశీలించారు. తహసీల్దారు విష్టువర్దన్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. గతంలో పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన ఘటనల గురించి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో 29 రూట్లు ఉన్నాయని, వాటికి సంబంధించి 50 బస్సులు అవసరమని తహసీల్దారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పదోతరగతి పరీక్షలు ఈనెల 18న ప్రారంభం కానున్న నేపథ్యంలో స్ట్రాంగ్‌ రూములకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడి నుంచే డీఈవోతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. పోలింగ్‌ రోజు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ సోమశేఖరరెడ్డి, ఎస్సై శివాంజల్, ప్రధానోపాధ్యాయుడు గురుస్వామి పాల్గొన్నారు.
                             

No comments:

Post a Comment