Wednesday, March 20, 2019

నాన్న చనిపోయిన కంటే ఆ వార్తలే బాధించాయి.. వైఎస్ సునీత.

కడపజిల్లా:పులివెందుల:  న్యూస్‌టుడే: 
నాన్న చనిపోయిన కంటే ఆ వార్తలే బాధించాయి..
వైఎస్ సునీతతొలిసారి మీడియా ముందుకు వచ్చిన వైఎస్ వివేకా తనయ సునీత.
దర్యాప్తు సంస్థ ఏదైనా విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్.
కుటుంబంలో విభేదాలున్నాయంటూ వచ్చిన వార్తలపై ఆవేదన.
గతవారం దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, బుధవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆమె… నాన్నకు తానంటే ఎంతో ప్రేమని, ఆయన చనిపోయిన బాధ కంటే తర్వాత మీడియాలో వచ్చిన కథనాలే తమను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని అవమానించేలా మాట్లాడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాదు, పులివెందుల ప్రజలంటే నాన్నకు ఎంతో అభిమానమని, కుటుంబ కంటే వారే ముఖ్యమని అన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా వెళ్లి అండగా నిలబడేవారన్నారు. అమ్మ కూడా అనారోగ్యంతో బాధపడుతోందని, నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారని తెలియజేశారు.

No comments:

Post a Comment