Sunday, March 17, 2019

దగ్ధమైన మిరపకాయలు….

 ప్రకాశం.యర్రగొండపాలెం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10ఆన్ లైన్ ఎడిషన్..
2.రూ.10 లక్షల మేర నష్టం….
3. తాపత్రపయపడుతున్న అన్నదాత….
ఆరుగాలం కష్టిస్తే చేతికొచ్చిన పంట.. దక్కలేదు. అగ్ని ప్రమాదం రైతుకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. మార్కెట్‌కు తరలిస్తున్న మిర్చిలోడు దగ్ధమవడంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లింది. వివరాల్లోకెళ్తే.. మండలంలోని అక్కపాలేనికి చెందిన రైతులు దాదాపు 250 బస్తాల మిరపకాయలను లారీకి ఎత్తుకుని ఆదివారం సాయంత్రం గుంటూరు మిర్చియార్డుకు బయల్దేరారు. శతకోడు సమీపానికి చేరుకునే సరికి రోడ్డుపైనున్న కరెంటు తీగలు బస్తాలకు తగిలి మంటలు చెలరేగాయి. ఎండు మిరప కాయలు కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. రైతులు అప్రమత్తమయ్యేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మోకులు కోసి బస్తాలు తొలగించేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. రూ.5 లక్షల విలువైన లారీ సైతం పూర్తిగా తగలబడిపోయింది. పంట డబ్బులు చేతికొస్తే అప్పులు తీర్చుకోవచ్చనే ఆశతో ఉన్న అన్నదాతలకు ఈప్రమాదం కన్నీరు మిగిల్చింది. అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధిత రైతులు జి.శ్రీను, సీహెచ్‌ వెంకటేశ్వర్లు, నాగయ్య, పెద్ద చెన్నయ్య, చిన్నవీరయ్య, జి.గాలెయ్య, గురవమ్మ, చంద్రయ్య, యర్రయ్యలు కన్నీరుమున్నీరయ్యారు.

No comments:

Post a Comment