జకార్తా న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
*ఇండోనే సియాలో ఆకస్మిక వరదలు..
* 42 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు..
ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని పపువా ప్రావిన్స్‌లో సంభవించిన మెరుపు వరదల్లో కనీసం 42 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రావిన్షియల్ రాజధాని జయపురాలో శనివారం కురిసిన భారీ వర్షాలతో సెంటాని నదికి భారీగా వరదలొచ్చాయి. ఈ వరదల్లో 21 మంది చనిపోయారని, అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ ప్రతినిధి సుతోపో పూర్వోనుగ్రహో తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశముంది. సహాయక దళాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయని ఆయన వివరించారు. ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ అధికారులు మాత్రం ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
No comments:
Post a Comment