Tuesday, March 19, 2019

కంటతడి పెట్టిన లలితకుమారి…….


చిత్తూరు బంగారుపాళ్యం, న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
*లలితకుమారి నివాసంలో మంతనాలు జరుపుతున్న మంత్రి అమరనాథ్‌రెడ్డి…
పూతలపట్టు నియోజకవర్గ తెదేపా బాధ్యురాలు లలితకుమారికి అసెంబ్లీ టిక్కెట్‌ దక్కక పోవడంతో ఆమె నిరాశకు లోనయ్యారు. తెదేపా అధిష్ఠానం పూతలపట్టు అసెంబ్లీ టిక్కెట్‌ పూర్ణానికి ఇచ్చారు. దీంతో ఆమె మంగళవారం తీవ్ర అసంతృప్తి చెందారు. ఈక్రమంలో బంగారుపాళ్యంలోని ఆమె నివాసం వద్దకు నియోజకవర్గ పరిధిలోని తవణంపల్లె, ఐరాల, బంగారుపాళ్యం, యాదమరి, పూతలపట్టు మండలాల నుంచి వందలాదిగా చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలు, నాయకులతో ఆమె నివాసం కిక్కిరిసింది. అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో ఆమె కంట తడిపెట్టారు. పలువురు నాయకులు, కార్యకర్తలు ఆమెను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ల దాఖలు చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వస్తున్నారని నాయకుల ద్వారా సమాచారం అందింది. దీంతో ఆమె మంత్రితో చర్చించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుందామని నాయకులు, కార్యకర్తలకు నచ్చచెప్పారు. మంత్రి సాయంత్రం ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. సుమారు గంటకుపైగా అంతర్గత మంతనాలు జరిపారు. ఆ తర్వాత మంత్రి కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రయత్నించారు. అయితే నాయకులు, కార్యకర్తలు మంత్రి ప్రసంగాన్ని ఖాతరు చేయలేదు. 35 సంత్సరాలుగా తెదేపాకు సేవ చేసిన కుటుంబానికి టిక్కెట్‌ ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైకాపా సానుభూతిపరుడికి తెదేపా అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేశానన్నారు.

No comments:

Post a Comment