విశాఖ న్యూస్‌టుడే:
- రాజాం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కురం నాగమణి ఇంట్లో చోరీ జరిగింది.
మండలంలోని రాజాంలో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సై అంబటి విజయ్‌కుమార్ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వెల్లడించారు. రాజాం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కురం నాగమణి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి గతనెల 23న ఆమె పెళ్లి కోసం తన అమ్మగారి ఇంటికి వెళ్లింది. ఈనెల ఒకటిన ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు, బీరువా తెరిచి వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. బీరువాలో దాచిన బంగారం వస్తువులు చూసుకుంటే కనిపించలేదు. అయిదున్నర తులాల బంగారం ఆభరణాలు, 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఈనెల 2 న బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై అంబటి విజయ్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను విచారించారు. బంగారుమెట్ట గ్రామానికి చెందిన మేరుగు గణేష్ అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నాగమణికి ఇతడు స్వయానా అల్లుడే కావడం గమనార్హం. ఏడాదిన్నర క్రితం నాగమణి కూతురును వివాహం చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటుకు పడిన గణేష్.. తన అత్తగారి ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడాన్ని గమనించి చోరీకి పాల్పడ్డాడు. ఈమేరకు బంగారుమెట్టలో ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. చోరీకి గురైన సొత్తును ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు.
No comments:
Post a Comment