ఢిల్లీ న్యూస్‌టుడే:
కారులో మంటలు చెలరేగి తల్లీ బిడ్డలు సజీవదహనమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఫ్లై ఓవర్‌పై సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, ఆమె కుమార్తెలు ఇద్దరు సజీవదహనమయ్యారు. ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా తన ముగ్గురు కుమార్తెలతో అక్షర్‌ధామ్ దేవాలయానికి కారులో వెళ్తున్నారు. అక్కడి ఫ్లై ఓవర్ మీదకు రాగానే.. కారు వెనుక భాగంలో నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించడంతో రంజన మిశ్రా, కుమార్తెలు రిధి, నిక్కి ప్రాణాలు కోల్పోయారు. సీఎన్జీ గ్యాస్ లీక్ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

No comments:
Post a Comment