పరమశివుడు, పార్వతీ! స్త్రీ ధర్మము గురించి నీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పవా, అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి, అయ్యో! నేను మీకు చెప్పగలదాననా! మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు, అని చెప్పి గంగా, యమునా, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తమస మొదలైన నదులను మనసులో వారికి పరమేశ్వరుడు తనను స్త్రీ ధర్మము గురించి అడిగాడని తనకు ఎలా చెప్పాలో తెలియక మిమ్ము పిలిచానని తెలిపింది. వారు “పార్వతీ! నీ కంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు. నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి నీ భర్తకు చెప్పి సంతోషపెట్టు. అప్పుడు పార్వతీదేవి మహేశ్వరుడి మీద చూపు నిలిపి “స్త్రీ ధర్మము గురించి చెబుతున్నాను. స్త్రీ వివాహత్పూర్వము కన్య అని పిలువబడుతుంది. తల్లి దండ్రులు కాని, పినతండ్రి కాని, మేనమామలు కానీ,అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైన కన్యకు తగిన వరుడితో వివాహము జరిపించడానికి అర్హులు. స్త్రీ వివాహానంతరం భర్తకుఆమె మీద సర్వహక్కులు సంక్రమిస్తాయి. భర్తయే భార్యకు ప్రభువు, దైవము, భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు ఆచరించాలి.

No comments:
Post a Comment