Monday, March 11, 2019

కోర్టు ఆవరణలో వదిలిన ప్రాణాలు…..


విజయనగరం న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
  *న్యాయస్థానం ప్రాంగణంలో కూలీ పనులుచేసే వ్యక్తి మృతి
  *కొంత కాలంగా భార్యభర్తల వివాదం కేసులో పలు మార్లు కోర్టుకు హాజరు
  *న్యాయవాది కోసం పరిగెడుతు ఒక్కసారిగా స్పృహాకోల్పోయాడు.
జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో కూలీ పనులుచేసే ఓ వ్యక్తి న్యాయవాది కోసం పరిగెత్తుతు ప్రాణాలను విడిచాడు.వివరాలు.విజయనగరంలోని మంగళ వీధికి చెందిన ఎస్.నాగేశ్వర్‌రావు(53) సోమవారం ఉదయం ఓ కేసు నిమిత్తం కోర్టుకు వెళ్ళాడు.ఇతను గత కొంత కాలంగా భార్యభర్తల వివాదం కేసులో పలు మార్లు కోర్టుకు హాజరవుతున్నాడు. అక్కడ న్యాయవాది కోసం పరిగెడుతు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.పడిపోయిన అతడిని స్థానికులు చూసి కేంద్ర ఆసుపత్రికి తరలించారు.అయితే నాగేశ్వర్‌రావు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.ఇతను అనారోగ్యంతోనే చనిపోయి ఉంటాడని గ్రామీణ స్టేషన్ పోలీసులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment