మంత్రాలయం, న్యూస్‌టుడే:
- బృందావనంలో కొలువై ..కొంగుబంగారమై …
- వైభవంగా కొనసాగుతున్న గురు వైభోత్సవాలు…
- మూడో రోజు స్వామికి ప్రత్యేక పూజలు..
- బృందావనంలో కొలువైన రాఘవేంద్రస్వామి..
- కోరిన భక్తులకు కొంగుబంగారంగా.. కలియుగ కల్పతరువుగా వెలుగొందుతున్నారు.
పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి గురు వైభోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో స్వామి మూలబృందావనానికి విశేషంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా పంచామృతాభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, స్వర్ణకవచం, పూలదండలతో స్వామివారి బృందావనాన్ని సుందరంగా అలంకరించారు. మూల సంస్థాన పూజలు చేసిన అనంతరం పీఠాధిపతి బృందావనానికి ప్రత్యేకంగా హారతులు చేశారు. ఉదయం పల్లకీలో ప్రహ్లారాయలను ఊరేగించారు. పాదపూజ, కనకాభిషేకం కనులపండువగా జరిగాయి. తరలివచ్చిన భక్తజనం స్వామి సేవలను తిలకించి తరించారు. రాత్రి మఠం ప్రాకారంలో ఉత్సవమూర్తి వెండి గజవాహనం, చెక్క, వెండి, బంగారు రథాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విద్వాన్ కరణం వెంకటేశ్‌చార్‌చే ప్రవచన కార్యక్రమాన్ని కొనసాగించారు. యోగీంద్ర వేదికపై హుబ్లీకి చెందిన డాక్టర్ వినోద్ జీ.కులకర్ణీచే దాసవాణి, బెంగళూరికి చెందిన చితపావన మహిళమండలి వారిచే యక్ష గాణ కార్యక్రమాలు వీణులవిందుగా సాగాయి. అనంతరం ప్రముఖులకు పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ ఎస్‌కే శ్రీనివాసరావు, శ్రీపతిచార్, డాక్టర్ ఎన్.వాదీరాజచార్, గౌతమచార్, ఐపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment