Saturday, March 9, 2019

రైలు పట్టాలు దాటుతుండగా, …రైలు ఢీ….


ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:
  • పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి(40) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
  • జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని ఆ వ్యక్తి పట్టాలు దాటుతుండగా, ఒంగోలు అన్నవరప్పాడు గేటు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ వ్యక్తిని గుర్తించిన కొందరు రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. స్థానికుడై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్‌ శవాగారంలో భద్రపరిచారు. హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.జె.కిషోర్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment