Saturday, March 9, 2019

సెల్‌ఫోన్ తో అపాయం…


విశాఖ న్యూస్‌టుడే: ఆగిఉన్న ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం కేంద్ర కారాగారం ఎదురుగా బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో ఆగి వున్న ఆటోను ప్రయాణికులతో వస్తున్న ఆటో ఢీకొంది ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్  చూసుకుంటూ నడపడం వల్ల ఎదురుగా ఆగి ఉన్న ఆటోనూ చూడలేదు. ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కావడంతో వెంనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. నిర్లక్ష్యంగా నడిపిన ఆటో డ్రయివరే చికిత్సకయ్యే ఖర్చును భరించాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వద్దకు పంచాయితీ చేరింది.
                                                                                    

No comments:

Post a Comment