Saturday, March 16, 2019

ఘనంగా ‘లడ్డూమార్‌’

ఉత్తర్‌ప్రదేశ్‌ న్యూస్‌టుడే:
  • రంగులు జల్లుకుంటూ కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ హోలీ సంబరాలు.
  • 51 టన్నుల లడ్డూలతో హోలీ!రంగులు జల్లుకుంటూ కేరింతలు కొడుతూ
నృత్యాలు చేస్తూ హోలీ సంబరాలు జరపడం అందరికీ తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఈ ఉత్సవాలకు అదనపు ఆకర్షణ లడ్డూలు. శ్రీకృష్ణుడి ప్రేమమూర్తి రాధ జన్మస్థలంగా పురాణాలు చెబుతున్న బర్సానాలో ఏటా జరిగే ఈ ‘లడ్డూమార్‌’ హోలీకి ఈ ఏడాది 51 టన్నుల లడ్డూలు తయారు చేయించారు. బర్సానా, నందగావ్‌ తదితర ప్రాంతాల్లో హోలీని ఫిబ్రవరి 10న ప్రారంభించి 40 రోజుల పాటు జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే గురువారం లడ్డూమార్‌ హోలీ నిర్వహించారు. ఇక్కడి గోస్వామి సమాజం ప్రతినిధులు చేయించిన లడ్డూలను భక్తులపైకి విసురుతూ వేడుక జరిపారు. సాయంత్రం 4 గంటలకు రాధమ్మ ఆలయాన్ని తెరవగానే భక్తులంతా కోలాహలంగా లడ్డూమార్‌ హోలీ ఆడారు. భజనలు, కీర్తనలు, కళాకారుల ఆటపాటలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.
                                                                                                                

No comments:

Post a Comment