Sunday, March 10, 2019

కాశీలో మోక్షం ఎలా….?


శ్రీ రామకృష్ణులకు దర్శనం అయిన విధం……. 
 పొడగరీ, బూడిద రంగు గలవాడు, జటాధారీ, శ్వేతకాయుడూ అయిన  పురుషుడొకడు(పరమేశ్వరుడు) మెల్లగా నడుస్తూ శ్మశానంలోని ప్రతి చితి వద్దకు వెళ్లి, ఒక్కోజీవుడిని జాగ్రత్తగా లేవదీసి చెవిలో తారక బ్రహ్మమంత్రాన్ని ఉపదేశించి వెళ్లసాగాడు. చితికి మరో వైపు సర్వశక్తిమంతురాలైన జగన్మాత  మహాకాళి రూపుదాల్చి జీవుడి స్థూల,సూక్ష్మ, కారణ బంధనాలనన్నింటినీ తెంచివేసి, స్వయంగా మోక్షద్వారం తెరిచి, ఆ జీవుడిని మోక్ష ద్వారానికి పంపుతూవుంది. ఈ విధంగా ఎన్నోకల్పాల నుండి కఠోర తపస్సులు అనుష్టించిన తరువాతే ఏ అద్వైతానుభూతి (మోక్షం) జీవుడికి లభిస్తుందో,దానిని  విశ్వనాధుడు జీవులకు క్షణంలో ప్రసాదించి వారిని తరింపచేస్తున్నాడు.

No comments:

Post a Comment