- పూర్వం దారుకుడు అనే పేరుగల రాక్షసుడు ఉండేవాడు.
- అతని భార్య దారుక ఆ రాక్షస దంపతులు మానవులను బాధిస్తూ, మహర్షుల యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ పశ్చిమ సముద్ర తీరంలో 1000 యోజనాల పొడవు 1000 యోజనాల వెడల్పుగల వనాన్ని సొంతం చేసుకుని విలాసంగా విహరించసాగారు.
- వారిచే బాధింపబడి సాధువులందరు ఔర్వ మహర్షి దగ్గరకు వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు.
- వానిని రక్షించాలని భావించిన ఔర్వ మహర్షి “నిరపరాధులైన భూమిమీది ప్రజలను హింసించిన యెడల ఆ రాక్షసులు మరుక్షనమే మరణించెదరుగాక” అని శపించాడు.
ఆ విషయం తెలిసిన దారుకుడు ఆ వనాన్నంతటిని పైకెత్తి సముద్రం మధ్యలో స్థాపించుకున్నాడు. మహర్షి తన శాపంలో “భూమిమీద ప్రజలు ఉన్నందువల్ల ఆ రాక్షస దంపతులు భూమిపై ఉన్న ప్రజల జోలికి పోకుండా సముద్రంలో ప్రయాణించేవారిని సంహరిస్తూ నిర్భయంగా కాలం గడపసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడొకడు. ఇతడు పరమ శివ భక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగాదివ్యతేజః పుజము కళ్ళు మిరిమిట్లు గొలుపునట్లు ప్రకాశించింది.

No comments:
Post a Comment