విజయనగరం న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……
*అశోక్, అదితిలు కుటుంబ సభ్యులతో ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి పయనమయ్యారు..
పూసపాటి వంశీయులు అశోక్‌గజపతిరాజు, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు బుధవారం అట్టహాసంగా నామపత్రాలు దాఖలు చేశారు. కోట కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 9 గంటలకే కూడలిలో కార్యకర్తల సందడి కనిపించింది. అశోక్, అదితిలు కుటుంబ సభ్యులతో ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి పయనమయ్యారు. ముందుగా పాతబస్టాండ్ వద్ద ఉన్న సిద్ధి వినాయకుని ఆలయంలో పూజలు చేశారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. డెంకషావలిబాబా ఆలయంలో పూజలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
No comments:
Post a Comment