గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
* అధికారి పక్షానికి, వివక్షానికి సమాన బాధ్యత ఉంటుంది…
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా జగన్ బాధ్యతలను విస్మరించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రాని జగన్‌కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. అధికారి పక్షానికి, వివక్షానికి సమాన బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. పోలవరంపై కుట్రలు చేస్తున్న కేసీఆర్ తో జగన్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. సాగర్ నుంచి నీళ్లు రాకుండా అడ్డుకున్న కేసీఆర్ తో మిలాఖత్ దారుణమన్నారు.కేసీఆర్ తో జతకట్టి ఏపీ ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెడతావా? అంటూ జగన్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment