న్యూస్‌టుడే,శ్రీకాకుళం:
లావేరు మండలంలోని వెంకటాపురం కూడలి వద్ద సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుంచి చీపురుపల్లి వెళ్లే వ్యాన్ లో రూ.58వేలు వెంకటాపురం నుంచి మెట్టపల్లి వెళ్లే వాహనదారుడి నుంచి రూ.75వేలు స్వాధీనం చేసుకున్నట్లు లావేరు ఉప తహసీల్ధార్ గిరిబాబు తెలిపారు. నగదుకు సరైన ఆధారాలు చూపించ్కపోవడంతో లావేరు ఎస్.ఐ.చిరంజీవి పర్యవేక్షన లో డబ్బును భద్రపరిచారు.సరైన పత్రాలను చూపిన అనంతరం డబ్బును తిరిగి తీసుకెళ్లవచ్చని ఆమె తెలిపారు. ఈ తనిఖిల్లో హెడ్ కాని స్టేబుల్ రమణమూర్తితోపాటు వీఆర్వోలు కిరణ్ మై, శ్రీనివాసరావుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment