కశింకోట, న్యూస్‌టుడే:
- అనకాపల్లి నియోజకవర్గంలో వైకాపా ఎన్నికల ప్రచారానికి బుధవారం గుడివాడ అమర్‌నాథ్, దాడి రత్నాకర్ శ్రీకారం చుట్టారు.
- ఈ మేరకు కశింకోట మండలం నూతనగుంటపాలెం శివారు అచ్యుతాపురంలో ఉన్న నల్లమారెమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించారు.
అనంతరం ఏనుగుతుని, నర్సింగబిల్లి, సోమవరం, ఏఎస్‌పేట గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో తెదేపా పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పూర్తిగా అక్రమాల్లో కూరుకుపోయిన పార్టీని గద్దె దింపి వైకాపాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్, గొల్లవిల్లి శ్రీనివాసరావు, గొర్లి సూరిబాబు, జాజుల రమేష్, వేగి దొరబాబు, శ్రీధర్‌రాజు, భూలోకనాయుడు, లగిశెట్టి గణేష్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment