కావల్సినవి:-
స్వీట్ కార్న్-కప్పు,సెనగపిండి-మూడు చెంచాలు,బియ్యప్పిండి-రెండు చెంచాలు,మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు,సన్నగా తరిగిన అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయల ముక్కలు-పావు కప్పు,పుదీనా ఆకులు-కొన్ని,నూనె-వేయించడానికి సరిపడా,గరం మసాలా-చెంచా,ఉప్పు-తగినంత.
తయారీ:–
ముందుగా స్వీట్ కార్న్‌ని మిక్సిలో తీసుకుని ఓ నిముషం తిప్పితే కొద్దిగా నలుగుతాయి.వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.అందులో సెనగపిండి,బియ్యపిండి,మొక్కజొన్ న పిండి,అల్లం,పచ్చిమిర్చి,ఉల్లి పాయల ముక్కలు,పుదీనా ఆకుల తరగూ,గరం మసాలా,తగినంత ఉప్పూ వేసుకుని బాగా కలుపుకోవాలి.కావాలంటే కొన్ని నీళ్లు చల్లుకుని తడి పొడిగా కలుపుకోవచ్చు.బాణలిలో వేడి చేసి ఈ పిండిని పకోడిల్లా వేసుకోవాలి.ఎర్రగా వేగాక తీసేయాలి.వీటిని వేడివేడిగా సాస్‌తో కలిపి తినవచ్చు.

No comments:
Post a Comment