గుంటూరు న్యూస్‌టుడే:
- ఇప్పటివరకూ నీరు విడుదలకాకపోవడం.
- యూరియా ద్వారా మొక్కల ప్రాణాన్ని నిలపగలుగుట.
సాగునీరు సరిపడా లేక జొన్న, మొక్కజొన్న పైర్లు ఎండిపోతున్నాయి. క్రమంలో బుధవారం అరకొరగా విడుదల చేసిన నీటిని రైతులు ఆయిల్ ఇంజిన్లతో పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో రైతులు సాగుచేసిన జొన్న, మొక్కజొన్న పంటకు మెయిన్ కాల్వ పక్కనున్న రైతులు మాత్రమే ఒకటి, రెండు తడులు నీటిని పెట్టుకోగలిగారు. బ్రాంచ్ కాలువలకు ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ నీటి విడుదల కాకపోవడంతో దూర ప్రాంతాల రైతులు ఒక్క తడైనా నీరందించలేకపోయారు. దీంతో పైర్లు ఎండిపోయి దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎండలు వేసవిని తలపించండంతో భూమిలో తేమ లేక నెర్రెలు పగిలి పంట పైర్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. కనీసం ఇప్పుడైనా ఒక్క తడి నీరందిస్తే వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంట ఎంతోకొంత చేతికందుతుందని రైతులు కోరుతున్నారు. లేకుంటే తీవ్ర నష్టాలకు చవిచూడాల్సి వస్తుందని ఆవేదనకు గురువుతున్నారు. మండలంలోని ఐలవరం, అద్దేపలి, కోనేటిపురం పల్లెకోన, రాచూరు గ్రామాల్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ గ్రామాల్లో బోరు వసతి లేకపోవడం, సాగు నీరు బ్రాంచ్ కాల్వల ద్వారా విడుదల కాకపోవడంతో ఇప్పటికీ ఒక్క తడైనా నీటిని అందించలేకపోయారు. ఈ క్రమంలో పైర్లను కాపాడుకోవటానికి ఒకటి, రెండు సార్లు యూరియా నీటిని అందించి మొక్కల ప్రాణాన్ని నిలపగలిగారు. ఇక నుండి ఎండలు ముదరడంతో పైరు బతికే పరిస్తితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
/GettyImages-10143911-5a67874c7a8ca20037a1b15a.jpg)
No comments:
Post a Comment