Monday, March 11, 2019

బహిరంగ లేఖ లో ఏముంది … ?

అమరావతి న్యూస్‌టుడే:
1.కేసీఆర్‌కు ఏపీ మంత్రి లేఖ
2.లేఖలో జగన్ పై వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రజల భవిష్యత్‌ మా బాధ్యత అని సీఎం చంద్రబాబు అంటే జగన్‌ భవిష్యత్‌ తన బాధ్యత అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటున్నారన్నారు. అవినీతి డైనోసార్‌ జగన్‌ కుట్రలకు లోటస్‌ పాండ్‌ కేంద్రంగా కేసీఆర్‌ మాస్టర్‌ప్లాన్‌ అందిస్తున్నారని పేర్కొన్నారు. 1985లో కార్యకర్తల వివరాలు సేకరించేటప్పుడు కేసీఆర్‌ కూడా టీడీపీ కార్యకర్త అనే సంగతి మరిచారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వ్యాపారాలున్న టీడీపీ నేతలు వైసీపీలో చేరడం వెనక కేసీఆర్‌ బెదిరింపులు లేవా? అని ప్రశ్నించారు.

No comments:

Post a Comment