Saturday, March 9, 2019

అభినందిస్తాడు – విమర్శిస్తాడు…. అన్న హీరో.

కమెడియన్ గా పృథ్వీ ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. “చిత్రపరిశ్రమకి సంబంధించిన వాళ్లలో మనస్ఫూర్తిగా పలకరించేవాళ్లు .. నవ్వేవాళ్లు తక్కువ. మనం కనిపించగానే ‘అన్నా బాగున్నావా’ అని ప్లాస్టిక్ నవ్వుతో పలకరించి, మనల్ని దాటుకుని వెళ్లగానే .. ఎందుకొచ్చిందిరా వీడికి ఈ అవకాశం’ అనుకునేవాళ్లు పదిమంది వుంటారు.
అయితే,  వీడు పైకి రావాలని కోరుకునేవాడు ఒకడుంటాడు. నా కెరియర్ కి సంబంధించినంత వరకూ ఆ ఒక్కడు .. రఘుబాబు. గిరిబాబుకి ఇద్దరు అబ్బాయిలు .. నేను మూడవవాడినని చెప్పుకుంటాను. రఘుబాబుతో నాకు అంతటి సాన్నిహిత్యం వుంది. ఏ పాత్రనైనా బాగా చేస్తే మెచ్చుకుంటాడు .. పాత్ర బాగోలేకపోతే ‘ఎందుకు చేశావు భయ్యా’ అంటాడు. ‘లౌక్యం’ సినిమాకి నాకు అవార్డు వచ్చినప్పుడు, ‘నా కంటే మా అన్నయ్యకి వచ్చినందుకు ఆనందపడుతున్నాను’ అని పబ్లిక్ ఫంక్షన్ లో చెప్పిన నిజమైన స్నేహితుడు రఘుబాబు” అని చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment