విశాఖపట్నం న్యుస్‌టుడే:
* వారిద్దరూ గత ఐదేళ్లుగా తెదేపాలోనే కొనసాగుతున్నారు. బలాబలాల్లో ఒకరిని మించినవారు ఒకరు..
పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ అంటే తెలియనివారుండరు. ఒకరు మాజీ ఎమ్మెల్యే, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. వీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. అయినా వారిద్దరూ గత ఐదేళ్లుగా తెదేపాలోనే కొనసాగుతున్నారు. బలాబలాల్లో ఒకరిని మించినవారు ఒకరు. వీరిద్దరూ 2019 ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేయడానికి చివరి క్షణం వరకు కృషి చేశారు. అధిష్ఠానం బండారుకు టికెట్ ఇచ్చింది. దీంతో గండి బాబ్జీ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అంతటా ఉత్కంఠత ఏర్పడింది. కాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం మంత్రం వేశారో తెలియదు కాని వారిద్దరూ ఒక్కటైపోయారు. ఒకే తాటిమీద నడుస్తామంటున్నారు. దీనిపై గండి బాబ్జీ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ తాను తెలుగుదేశంలోనే ఉన్నానని, ఆ పార్టీలోనే పని చేస్తున్నట్లు చెప్పారు. తెదేపా విజయానికే కృషి చేస్తానన్నారు. తనకు టికెట్ వస్తుందని ఆశించానని కాని బండారుకు ఇచ్చారన్నారు. ఇద్దరినీ కలిసి పనిచేయమని అధిష్ఠానం ఆదేశించిందన్నారు. దీనిపై బండారు, తాను సమావేశమై పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.

No comments:
Post a Comment