Wednesday, March 20, 2019

సైనికుల్లా పనిచేయాలి………..

విశాఖపట్నం న్యూస్‌టుడే: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గత అయిదేళ్లలో అమలు చేశామని, సంక్షోభం నుంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డామన్నారు.. రానున్న 20 రోజులు తెదేపా శ్రేణులు సైనికుల మాదిరిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. బుధవారం సాయంత్రం ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గత అయిదేళ్లలో అమలు చేశామని, సంక్షోభం నుంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డామన్నారు. ఆయా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని, ప్రతిపక్ష వైకాపా కుట్రలను ప్రజలకు తెలియజేయాలని, తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని చాటిచెప్పాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ సమయంలో అంతర్జాల ఇబ్బందులు తలెత్తి సీఎం ప్రసంగం పూర్తిగా నేతలు వినలేకపోయారు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోన్న
  • ఎం.శ్రీభరత్‌(విశాఖ లోక్‌సభ)
  • ఎ.ఆనందకుమార్‌ (అనకాపల్లి లోక్‌సభ)
  • వాసుపల్లి గణేష్‌కుమార్‌ (విశాఖ దక్షిణ)
  • వెలగపూడి రామకృష్ణబాబు (తూర్పు)
  • గణబాబు (పశ్చిమ)
  • పల్లా శ్రీనివాసరావు (గాజువాక)
  • బండారు సత్యనారాయణమూర్తి(పెందుర్తి)
  • పీలా గోవిందు సత్యనారాయణ (అనకాపల్లి)
  • కెఎస్‌ఎన్‌ రాజు (చోడవరం)
  • రామానాయుడు (మాడుగుల)
  • గిడ్డి ఈశ్వరి (పాడేరు)
  • శ్రావణ్‌కుమార్‌ (అరకు)
  • డాక్టర్‌ బి.బంగారయ్య (పాయకరావుపేట) ప్రమాణం చేశారు.
మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, తెదేపా రూరల్‌ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, భీమునిపట్నం నియోజకవర్గ అభ్యర్ధి సబ్బంహరిలు కార్యక్రమానికి హాజరవలేదు. కార్యక్రమానికి హాజరైన అభ్యర్థులకు పార్టీ పరంగా వచ్చిన ఎ, బి, ఫారాలను తెదేపా నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్‌ ఎస్‌ఎ రెహ్మాన్, పట్టాభి, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.
                                                  

No comments:

Post a Comment