కడప న్యూస్‌టుడే:
* ఓటరు జాబితాలో ఉన్న పేర్లను తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన ఫారం-7 దరఖాస్తులు.
* ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని 28 కేసులను పెట్టినట్లు చెప్పారు.
కడప జిల్లా ఒంటిమిట్టలో ఓటరు జాబితాలో ఉన్న పేర్లను తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన ఫారం-7 దరఖాస్తులపై రెవెన్యూ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ఒంటిమిట్టలో ఎస్పీ గురువారం విలేకర్లతో మట్లాడారు.ఇప్పటికే తమకు అందించిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని 28 కేసులను పెట్టినట్లు చెప్పారు.ఇందులో ఎవరి పాత్ర ఉందో తేల్చేందుకు సైబర్ నేరాలను శోధించే ప్రత్యేక బృందంతో సమగ్రంగా విచారణ చేయిస్తామని వివరించారు.

No comments:
Post a Comment