ఒంగోలు న్యూస్‌టుడే:
- హక్కుల సాధనలో మహిళలకు చైతన్యం అవశ్యమని జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారిణి ఎం.రజనీకుమారి అన్నారు.
- జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవం నిర్వహించారు.
- సంఘం అధ్యక్షుడు వినుకొండ రాజారావు అధ్యక్షత వహించారు.
రజనీకుమారి మాట్లాడుతూ… సమాజంలో నేటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పోవాలంటే మహిళల్లో అవగాహన పెరగాలని సూచించారు. అనంతరం మహిళా అధికారులు రజనీకుమారి, వ్యవసాయశాఖ డీడీ వజ్రశ్రీ, జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి నీలం ఇందిరాదేవి, పేస్ ఇంజినీరింగ్ కళాశాల ఉమెన్ ఎంపవర్‌మెంట్ కౌన్సెలర్ స్రవంతి, ఏఎన్‌ఎం రేణుకాదేవిని సత్కరించారు. ఉద్యోగ సంఘ నాయకులు కేఎస్ ప్రకాష్, వెంకటేశ్వరరావు, కిరణ్‌కుమార్‌రెడ్డి, కిరణ్, మక్కెన శ్రీనివాసరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment