Tuesday, March 19, 2019

విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు చెట్టు వేరు.

విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు చెట్టు వేరు. మరి ఆ వేరుని ఎప్పుడు,ఎలా గుమ్మానికి కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఏదైనా ఒక మంచి రోజు అంటే దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథి రోజుల్లో ఆ వినాయకుడి మంత్రములతో మనసుని నింపుకోవాలి. అంటే “ఓం గం గణపతయే నమః ” అని అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని క్షమించమని వేడుకోవాలి. ఆ తరువాత చెట్టు వేరుని తీసుకువచ్చి గుమ్మానికి ఎదురుగా కట్టాలి. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉండే గృహ, గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులవుతారు. అది ఎల అంటే ఆ వేరుని కట్టడం వలన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి ప్రవేశించదు. దీని వలన ఇంట్లో మనశ్సాంతి నెలకొంటుంది. కాబట్టి అన్ని గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయో అప్పుడు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు లాభం చేకూరుతుంది. కావున మీరు కూడా ఇప్పుడు చెప్పిన పరిష్కారాన్ని చేయడం వలన మీకు ఉన్న గ్రహ, వాస్తు, దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు.

No comments:

Post a Comment