చిత్తూరు న్యూస్‌టుడే:
*నగరంలో బలగాలతో ర్యాలీ నిర్వహణ.
ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చగా ఉపయోగించుకోవాలని ప్రజల భధ్రతకు తాము అండగా ఉంటామని అర్భన్ జిల్లా ఎస్పీ కె.కె.ఎన్.అన్బురాజన్ పేర్కొన్నారు. సోమవారం నగరంలో కేంద్రం నుంచి వచ్చిన అదనపు బలగాలతో ర్యాలీని శాంతిభద్రతల అదనపు ఎస్పీ అనిల్‌బాబు ప్రారంభించారు. అనంతరం ర్యాలీ నగరంలోని బాలాజీకాలనీ నుంచి టౌన్‌క్లబ్, గాంధీరోడ్డు, ఎయిర్‌బైపాస్ మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు కవాతు జరిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు భరోసా కల్పించడమే కవాతు ఉద్దేశమన్నారు. ప్రస్తుతం జిల్లాకు 60సెక్షన్‌ల పారామిలటరీ దళాలు వచ్చాయని తెలిపారు.
No comments:
Post a Comment