Wednesday, March 20, 2019

కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ….

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. నటన పరంగా .. గ్లామర్ పరంగా ఆమెకి మంచి ఫాలోయింగ్ వుంది. ‘మహానటి’ తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ .. తమిళంలో ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఒక కథ నచ్చడంతో చేయడానికి వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేంద్రనాథ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. రాజేంద్రప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నదియా .. కమల్ కామరాజు .. భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా వదిలారు. మరికొంతమంది నటీనటుల పేర్లను త్వరలోనే తెలియజేయనున్నట్టు చెప్పారు.

No comments:

Post a Comment