Wednesday, March 20, 2019

కిక్‌ బాక్సింగ్‌లో పతకాలు….


విశాఖపట్నం  పీఎంపాలెం,  న్యూస్‌టుడే:
పీఎంపాలెం సాంకేతిక విద్యాపరిషత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థుల బృందం నగరంలో జరిగిన ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ-2019 కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలు గెలుచుకున్నట్లు వ్యాయామ విభాగం సంచాలకులు డాక్టర్‌ శ్యామ్‌సుందర్, ఎల్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం గోల్డెన్‌ జూబ్లీ అంతర్‌ మైదానంలో నిర్వహించిన పోటీల్లో ఇంజినీరింగ్‌ ఆయా విభాగాల్లో చదువుతున్న జి.ప్రవళ్లిక, జి.జ్యోత్స్న, సాయిశ్రీ, ఎం.సాయికుమార్, జి.ఎల్లాజీ, పి.చక్రధర్‌లు బంగారు, రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారన్నారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థుల బృందాన్ని విద్యాసంస్థల కరస్పాండెంట్, కార్యదర్శి ఎస్‌.వి.హెచ్‌.రాజేంద్ర, హెచ్‌ఆర్, అడ్మిన్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.పి.రావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మధుభట్, కళాశాలల ప్రధానాచార్యులు డాక్టర్‌ ఎం.రాంజీ, జి.విద్యాసాగర్‌ తదితరులు అభినందించారు.
                                                                 

No comments:

Post a Comment