కావాల్సినవి:
- పొడుగు వంకాయలు – మూడు
- ఉప్పు – తగినంత
- నూనె – చెంచా
- మిరియాలపొడి – అరచెంచా
- ఆరిగానో – చెంచా
తయారీ:
వంకాయల్ని చక్రాల్లా కోసి కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో వేయలి. తరవాత తీసి తడి తుడిచి మిరియాలపొడీ, ఆరిగానో, నూనె కలిపి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంటసేపు బేక్ చేసుకుని తీసుకోవాలి. లేదంటే వంకాయ ముక్కల్ని ముందు వేయించుకుని ఆ తరవాత ఉప్పూ, మిరియాలపొడీ, ఆరిగానో చల్లుకోవాలి. ఇలా చేసుకున్న చిప్స్ సాస్‌తో బాగుంటాయి.
No comments:
Post a Comment