Wednesday, March 20, 2019

మరోసారి విజయానికి నామినేషన్‌ వేశా: శివప్రసాద్‌……….

చిత్తూరు  న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
*చంద్రబాబు చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది..
మరోసారి చిత్తూరు లోక్‌సభ స్థానంలో విజయం సాధించడానికే నామినేషన్‌ వేశా..
పరిపాలనాదక్షుడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్దే తనను మరోసారి ఎంపీగా గెలిపిస్తుందని ఎంతో నమ్మకంగా చెబుతున్నానని చిత్తూరు లోస్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన తెదేపా అభ్యర్థి డాక్టర్‌ ఎన్‌.శివప్రసాద్‌ చెప్పారు.
చిత్తూరులోని జిల్లా సచివాలయానికి బుధవారం మధ్యాహ్నం 1.31గంటలకు చేరుకున్న ఆయన.. భార్య డాక్టర్‌ విజయలక్ష్మీ, ఎమ్మెల్సీ రాజసింహులు, తెదేపా నాయకుడు సురేంద్రకుమార్‌తో కలసి చిత్తూరు లోక్‌సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయని పనిలేదని.. పుట్టినప్పుటి నుంచి.. కాటికి వెళ్లే వరకు అన్ని దశల్లోనూ ప్రజలకు సాయం అందించేలా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘతన చంద్రబాబుదే అన్నారు. పసుపు-కుంకుమ పథకం, పింఛన్లు రెట్టింపు చేయడంతో వృద్ధులు, మహిళలు సీఎంను పెద్దకొడుకుగా, అన్నదమ్ములుగా చూస్తున్నారన్నారు. మరోసారి ఆయనే సీఎం కావాలని కోరుతున్నారని చెప్పారు. నేటి నుంచి ప్రజలతో మమేకమై తాను నిరంతరం ప్రచారం చేస్తానని.. చెప్పారు. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి, చిత్తూరు -నాయుడుపేట ఆరు వరసల రహదారులు చూస్తుంటే అభివృద్ధి కళ్లెదుట అందంగా కనిపిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్వోబీల నిర్మాణం మొదలైందని.. ఇవన్నీ చేసిన అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యాలని పేర్కొన్నారు. తెదేపా ఎస్సీసెల్‌ కార్యదర్శి రబ్బీ, పార్టీ నాయకులు దశరథనాయుడు, పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment