- తెలుగులో ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, హీరోగా కార్తికేయ ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది.
- దాంతో ఆయనను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వస్తున్నాయి.
వాటిలో తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఒక ద్విభాషా చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు .. ఆ సినిమా పేరే ‘హిప్పీ’. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయన్నున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే పనిలో వున్నారు. కలైపులి తాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కథానాయికగా ఈ సినిమాతో ‘దిగాంగన’ పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. నివాస్ కె. ప్రసన్న అందించిన సంగీతం, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.

No comments:
Post a Comment