Wednesday, March 13, 2019

జైలులో బీజేపీ కుమారుడు..?


భోపాల్  న్యూస్‌టుడే:ముఖ్యంశాలు :
  • డ్రగ్స్ కేసులో బీజేపీ ఎంపీ కుమారుడు అరెస్ట్…
  • పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరపగా సత్యేంద్ర వద్ద 3,380 గ్రాముల 41 హెరాయిన్ ప్యాకెట్లు లభించాయని పోలీసులు చెప్పారు. …
 బీజేపీ ఎంపీ కుమారుడిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండ్ల పట్టణంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ సంపాతీయ ఉయే కుమారుడు సత్యేంద్రను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరపగా సత్యేంద్ర వద్ద 3,380 గ్రాముల 41 హెరాయిన్ ప్యాకెట్లు లభించాయని పోలీసులు చెప్పారు. సత్యేంద్రతోపాటు షారూక్, అభిషేక్ లను పోలీసులు అరెస్టు చేశారు. హోండా బ్రియో కారులో పోలీసులకు హెరాయిన్ లభించిందని ఎస్పీ పరిహర్ చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మొత్తంమీద ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీ కుమారుడు డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరకడం సంచలనం రేపింది.

No comments:

Post a Comment