Wednesday, March 13, 2019

ప్రకాశం – గుంటూరు జిల్లాల సరిహద్దులోని తనిఖీ ….


డేగరమూడి, రాజుపాలెం (మార్టూరు), న్యూస్‌టుడే:
కారులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదును మార్టూరు పోలీసులు స్వాధీనం చేసుకుని… పత్రాల పరిశీలన అనంతరం విడిచిపెట్టారు. పదహారో నంబరు జాతీయ రహదారిపై ప్రకాశం – గుంటూరు జిల్లాల సరిహద్దులోని తనిఖీ కేంద్రం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎస్సై వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీ చేస్తూ… కారులో నగదు తరలిస్తున్న విషయం గుర్తించి సీజ్‌ చేశారు. యూనియన్‌ బ్యాంక్‌ గుంటూరు లక్ష్మీపురం క్యాష్‌ చెస్ట్‌ నుంచి రావినూతల బ్యాంకుకు ఈ మొత్తాన్ని తీసుకువెళ్తున్నారు. సంబంధిత పత్రాలను పరిశీలించి… నగదు విడుదల చేసినట్లు ఎస్సై తెలిపారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లే సమయంలో తప్పనిసరిగా సంబంధిత రసీదులు, దస్త్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్సై సూచించారు.

No comments:

Post a Comment